మళ్లీ అదరగొట్టిన డ్యాన్సింగ్ అంకుల్.. ఈసారి సొంత మ్యూజిక్‌తో.. వీడియో

Thu,March 14, 2019 03:45 PM

డ్యాన్సింగ్ అంకుల్ గుర్తున్నారా మీకు. కొన్ని రోజుల కింద సోషల్ మీడియాలో ఈయన గురించే కదా చర్చ. ఓ పెళ్లి పార్టీలో గోవిందా స్టయిల్ డ్యాన్స్ వేసి అదరగొట్టారు కదా. ఆయన్ను ముద్దుగా డబ్బు ది డ్యాన్సర్ అని కూడా పిలుస్తారు కదా. ఆయన పేరు సంజీవ్ శ్రీవాత్సవ. ఆయనది మధ్యప్రదేశ్. గుర్తొచ్చారా? ఆయనే.. ఇప్పుడు మళ్లీ డ్యాన్స్ వేసి అదరగొట్టారు. కానీ.. ఈసారి పూర్తిగా డిఫరెంట్. మామూలు డిఫరెంట్ కాదు. ఈసారి ఆయన వేసిన డ్యాన్స్‌కు చాలా స్పెషాలిటీస్ ఉన్నారు.
చాచా నాచ్ అనే పేరుతో డ్యాన్సింగ్ అంకుల్ ఈ వీడియోను రూపొందించారు. మ్యూజిక్ కంపోజర్ జాసిమ్, సింగర్ బెన్నీ దాయల్‌తో కలిసి డ్యాన్సింగ్ అంకుల్ ఈ వీడియోను రూపొందించారు. సొంత మ్యూజిక్‌తో రూపొందించిన వీడియో ఇది. చాచా నాచ్ అనేది.. ప్రపంచంలోని అంకుల్స్ అందరూ కనిపెట్టిన తక్కువ స్థాయి ఇండియన్ డ్యాన్స్ అంటూ ఆ వీడియోకు క్యాప్సన్ కూడా ఇచ్చారు. హేయ్. అంకుల్ మళ్లీ వచ్చేశారు.. తన డ్యాన్స్ మూమెంట్స్‌తో చంపేస్తున్నారు.. అంటూ నెటిజన్లు ఆ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు.

2685
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles