ఆ డ్యాన్సింగ్ అంకుల్‌కు ఈ డ్యాన్సింగ్ ఆంటీ పోటీ.. వీడియో

Sun,June 17, 2018 07:02 PM

Dancing Uncle got a competition from this Dancing Aunty

ముంబై: డ‌్యాన్సింగ్ అంకుల్ తెలుసు క‌దా.. ఈ మ‌ధ్య ఓ ఫంక్ష‌న్‌లో గోవిందా స్టెప్పుల‌తో తెగ ఫేమ‌స‌య్యాడు. సోష‌ల్ మీడియాలో సంజీవ్ శ్రీవాస్త‌వ అనే ఆ వ్య‌క్తి వీడియో వైర‌ల్‌గా మార‌డంతో పెద్ద సెల‌బ్రిటీగా మారిపోయాడు. ఈ మ‌ధ్యే అదే గోవిందాతో క‌లిసి స్టెప్పులేసే అవ‌కాశాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఇలాగే ఓ డ్యాన్సింగ్ ఆంటీ.. త‌న స్టెప్పుల‌తో ఇర‌గ‌దీస్తున్న‌ది. ఫేస్‌బుక్‌లో ఆమె వీడియో షేర్ చేయ‌గా.. దానికి ఇప్ప‌టికే 20 ల‌క్ష‌ల‌కుపైగా వ్యూస్ వ‌చ్చాయి. ఆమె స్టెప్పులు చూసి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. యొ యొ హ‌నీ సింగ్ పాపుల‌ర్ సాంగ్ పార్టీ ఆల్ నైట్ సాంగ్‌కు ఆమె చేసిన డ్యాన్స్ చూస్తే మ‌తి పోతుంది. ఈ డ్యాన్సింగ్ ఆంటీ స్టెప్పులు మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

4941
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles