దళిత ఎంపీకి బీజేపీపై కోపం ఎందుకు వచ్చింది?

Thu,December 6, 2018 03:50 PM

Dalit MP bids good-bye to BJP

ఫైర్‌బ్రాండ్ దళిత ఎంపీ సావిత్రీబాయి ఫూలే బీజేపీకి గుడ్‌బై చెప్పారు. ఈ సందర్భంగా ఆమె బీజేపీ నాయకత్వంపై ధ్వజమెత్తారు. భారతదేశ సంపదను దేశ అభివృద్ధి కోసం కాకుండా విగ్రహాల కోసం వినియోగిస్తున్నారని మండిపడ్డారు. కొన్నాళ్లుగా ఆమె పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. తన వ్యాఖ్యలతో సంచలనం సృష్టిస్తున్నారు. యూపీలోని బారేచ్ నుంచి గెలిచిన సావిత్రీబాయి తాను సంఘసేవకురాలిగా దళితుల కోసం కృషి చేస్తున్నానని అన్నారు. బీజపీ దళితుల రిజర్వేషన్ కోసం ఏమీ చేయడం లేదని విరుచుకుపడ్డారు. హనుమంతుడు దళితుడు కనుకనే మనువాదులు బానిసగా మార్చారని అంతకు ఒకరోజు ముందు ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హనుమంతుడు దళితుడని చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమంతుడు దళితుడని, మానవుడని, రామునికోసం ఎంతో చేశాడని అన్నారు. మరైతే అతడికి తోకను తగిలించి ముఖానికి నల్లరంగు ఎందుకు పులిమారని ప్రశ్నించారు. అసలు కోతిని ఎందుకు చేశారు? నరునిగా కాకుండా వానరునిగా ఎందుకు చిత్రించారు? దళితుడు కావడం వల్లనే ఆనాడు హనుమంతుడు అవమానాలు ఎదుర్కొన్నాడు. మా దళితులని మనుషులుగా ఎందుకు చూడరు? అని నిలదీశారు. దళితుల పట్ల బీజేపీ వైఖరిని మొదటినుంచీ సావిత్రీబాయి ప్రశ్నిస్తూనే ఉన్నారు.

1615
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS