గుర్రంపై స్వారీ.. దళితుడి హత్య

Sat,March 31, 2018 10:57 AM

Dalit man killed by upper caste duo in Gujarat for owning and riding a horse

అహ్మదాబాద్ : ఓ దళితుడు గుర్రంపై తిరగడం.. అగ్రవర్ణాలు జీర్ణించుకోలేకపోయాయి. ఆ దళితుడిని అగ్ర వర్ణాలకు చెందిన యువకులు హత్య చేశారు. ఈ ఘటన గుజరాత్‌లోని భావనగర్ జిల్లాలోని టింబి గ్రామంలో గురువారం సాయంత్రం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన దళిత యువకుడు ప్రదీప్ రాథోడ్(21) రెండు నెలల క్రితం ఓ గుర్రాన్ని కొన్నాడు. ఆ గుర్రంపై ప్రతి రోజూ ఊర్లో తిరుగుతూ ఉండేవాడు. ప్రదీప్ గుర్రంపై స్వారీ చేయడం అగ్రవర్ణాలకు చెందిన యువకులకు నచ్చలేదు.

దీంతో గురువారం సాయంత్రం ప్రదీప్ వ్యవసాయ పొలం వద్దకు అగ్రవర్ణాల యువకులు చేరుకున్నారు. అక్కడే ఉన్న ప్రదీప్‌ను యువకులు చంపేశారు. గుర్రాన్ని కూడా చంపి అక్కడే పడేశారు. ఈ ఘటనపై పోలీసులకు ప్రదీప్ తండ్రి కాలుభాయ్ రాథోడ్ ఫిర్యాదు చేశాడు. తమ కుమారుడిని గుర్రంపై తిరగొద్దని కొంతమంది యువకులు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

1468
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles