నెహ్రూపై కామెంట్లు.. దలైలామా సారీ

Fri,August 10, 2018 03:05 PM

Dalailama apologises for comments on Nehru

భారత్‌లో ఆశ్రయం పొందిన టిబెటన్ మతగురువు దలైలామా ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై నోరుజారి నాలుక కరుచుకున్నారు. నెహ్రూకు బదులుగా మహమ్మదాలి జిన్నాను ప్రధానిని చేస్తే దేశ విభజన జరిగేది కాదన్న పాత చింతకాయ పచ్చడి వాదననే మరోసారి వినిపించారాయన. గోవాలో ఒక విద్యార్థుల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాంధీ చెప్పినట్టుగా జిన్నాను ప్రధానిని చేసేందుకు నెహ్రూ ఆనాడు ఒప్పుకొని ఉంటే పాకిస్థాన్ ఏర్పడేదే కాదన్నట్టు చెప్పుకొచ్చారు. నెహ్రూ తన గురించే ఆలోచించడం వల్ల ఇదంతా జరిగిందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అన్నివైపుల నుంచి ఈ వ్యాఖ్యలపై విమర్శలు వచ్చేసరికి తాను ఎవరినీ నొప్పించే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని సారీ చెప్పారు. నా వ్యాఖ్యపై వివాదం చెలరేగింది. నేనేదైనా తప్పుగా అంటే క్షమించండి అని పేర్కొన్నారు. గాంధీజీ దేశవిభజనకు వ్యతిరేకమని తెలిసి అయ్యో అనిపించింది. పాకిస్థాన్ కన్నా ఇండియాలోనే ముస్లింలు ఎక్కువగా ఉన్నారని కూడా గుర్తుచేశారు. అయినా అంతా గతంగతః అని అన్నారు. చైనా దళాలు టిబెట్‌ను ఆక్రమించుకున్నప్పుడు దలైలామా రహస్యంగా పారిపోయి ఇండియాకు వస్తే ఆశ్రయం కల్పించింది నెహ్రూయే.

940
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS