జీఎస్టీ బిల్లుకు లోక్ సభ ఆమోదం

Wed,March 29, 2017 08:44 PM

dabate on gst bill in loksabha


న్యూఢిల్లీ: జీఎస్టీ బిల్లులకు లోక్ సభ ఆమోదం తెలిపింది. సీజీఎస్టీ, ఐజీఎస్టీ, రాష్ర్టాలకు పరిహారం చెల్లింపు బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల జీఎస్టీ బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. జీఎస్టీ బిల్లులపై చర్చ సందర్భంగా కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ జీఎస్టీ బిల్లు తాను మాత్రమే రూపొందించింది కాదన్నారు. ఏడుగురు కాంగ్రెస్ మంత్రుల ఆధ్వర్యంలో బిల్లుకు రూపకల్పన జరిగిందన్నారు. యూపీఏ ప్రభుత్వం పరిహారం గురించి పట్టించుకోలేదన్నారు. వివిధ ధరల్లో జీఎస్టీ ఉండటం వల్ల సేవలు సరళతరమవుతాయన్నారు.

పరిహారం చెల్లించేందుకు సెస్ వినియోగిస్తామని జైట్లీ తెలిపారు. ఐదేళ్లపాటు సెస్ అమలులో ఉంటుందని తెలిపారు. రాజ్యాంగంతో జీఎస్టీకి సాధికారత చేకూరుతుంది. జీఎస్టీ అమలు వల్ల సరుకుల ధరలు తగ్గివస్తాయని పేర్కొన్నారు. ఆల్కాహాల్, పెట్రోలియంను జీఎస్టీ పరిధిలోకి తేవడంపై మండలి నిర్ణయిస్తుందని జైట్లీ పేర్కొన్నారు.

812
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles