సైర‌స్ మిస్త్రీకి మ‌రో ప‌రాభ‌వం

Mon,December 12, 2016 11:45 AM

Cyrus Mistry has been removed as Director of Tata industries

ముంబై: టాటా స‌న్స్ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి అవ‌మాన‌క‌ర రీతిలో వైదొల‌గిన సైర‌స్ మిస్త్రీకి మ‌రో ప‌రాభ‌వం ఎదురైంది. ఇవాళ జ‌రిగిన షేర్ హోల్డ‌ర్స్ స‌మావేశంలో ఆయ‌న‌ను టాటా ఇండ‌స్ట్రీస్‌ డైరెక్ట‌ర్ ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. ఈ విష‌యాన్ని టాటా అధికార ప్ర‌తినిధి ఒక‌రు వెల్ల‌డించారు. సోమ‌వారం జ‌రిగిన టాటా ఇండ‌స్ట్రీస్ ఎక్స్ట్రాడిన‌రీ జ‌న‌ర‌ల్ మీటింగ్ (ఈజీఎం)లో మిస్త్రీని తొల‌గించాల్సిందిగా ఏక‌గ్రీవ నిర్ణ‌యం తీసుకున్నారు. బోర్డు నుంచి మిస్త్రీని తొల‌గించాల్సిందిగా టాటా గ్రూప్ కంపెనీల షేర్ హోల్డ‌ర్ల‌ను టాటా స‌న్స్ కోరింది.

బోర్డులో ఆయ‌న కొన‌సాగితే అది టాటా గ్రూప్ ముక్క‌ల‌వ‌డానికి దారితీసే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించింది. వ‌చ్చే కొన్ని వారాల్లో మిస్త్రీని తొల‌గించ‌డానికి ఆరు టాటా గ్రూపు కంపెనీలు ఇలాంటి స‌మావేశాలు మ‌రిన్ని నిర్వ‌హించ‌నున్నాయి. అక్టోబ‌ర్‌లోనే మిస్త్రీని టాటా స‌న్స్ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి తొల‌గించినా.. త‌ర్వాత కూడా గ్రూపులోని కొన్ని కంపెనీల‌కు బోర్డు స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు. మిస్త్రీ స్థానంలో ర‌త‌న్ టాటా మ‌రోసారి టాటా స‌న్స్ చైర్మ‌న్ అయిన విష‌యం తెలిసిందే.

2822
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles