గుజ‌రాత్‌కు దూరంగా.. వాయు తుఫాన్

Thu,June 13, 2019 09:52 AM

Cyclone Vayu will not hit Gujarat, says IMD

హైద‌రాబాద్‌: వాయు తుఫాన్ దిశ మారిన‌ట్లు ఇవాళ భార‌తీయ వాతావ‌ర‌ణ‌శాఖ వెల్ల‌డించింది. గుజ‌రాత్ రాష్ట్రాన్ని వాయు తుఫాన్ తాక‌ద‌ని ఐఎండీ స్ప‌ష్టం చేసింది. రాత్రికి రాత్రే ఆ తుఫాన్ దిశ మారిన‌ట్లు తెలిపింది. కానీ గుజ‌రాత్ తీరం వెంట బ‌ల‌మైన గాలులు వీస్తాయ‌ని ఐఎండీ పేర్కొన్న‌ది. వీరావ‌ల్‌, పోరుబంద‌ర్‌, ద్వారకా స‌మీపం నుంచే తుఫాన్ వెళ్లిపోనున్న‌ట్లు వాతావ‌ర‌ణ‌శాఖ చెప్పింది. రాష్ట్రంలోకి తుఫాన్ ప్ర‌వేశించ‌క‌పోయినా.. వ‌ర్షాలు మాత్రం తీరం వెంట భారీగా కురుస్తాయ‌ని హెచ్చ‌రించింది. స్కైమెట్ వాత‌వార‌ణ సంస్థ కూడా వాయు తుఫాన్ .. గుజ‌రాత్‌లోకి ప్ర‌వేశించ‌ద‌ని వెల్ల‌డించింది. సౌరాష్ట్ర తీరం నుంచి అది దూరంగా వెళ్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ముంబైతో పాటు గుజ‌రాత్ తీరం వెంట ఉన్న అన్ని బీచ్‌ల‌ను మూసివేశారు.1044
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles