మరికొద్ది గంటల్లో తీవ్ర తుపానుగా పెథాయ్

Sun,December 16, 2018 01:29 PM

Cyclone Phethai to Hit Andhra Pradesh Tomorrow

అమరావతి: వాయువేగంతో దూసుకొస్తున్న పెథాయ్ తుపాను కోస్తాంధ్ర జిల్లాలను వణికిస్తోంది. మరికొద్ది గంటల్లో తీవ్ర తుపానుగా పెథాయ్ మారనుంది. తీరప్రాంతాల్లో పెథాయ్ ప్రభావం ఇప్పటికే మొదలైంది. రేపు కాకినాడ-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. శ్రీహరికోటకు 529 కిలోమీటర్ల దూరం కేంద్రీకృతమైంది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో తుపాను తీరంవైపు కదులుతోంది. తూర్పుగోదావరి నుంచి విశాఖపట్నం మధ్య తీరం దాటే సూచనలు కన్పిస్తున్నాయి. ఐవీఆర్‌ఎస్ ద్వారా తుపాను హెచ్చరికల సందేశాలను జారీ చేస్తున్నారు. తుపాను ప్ర‌భావం త‌మిళ‌నాడుపై కూడా ప‌డ‌నుంది. రేపటి నుంచి తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

6322
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles