క్రిప్టోకరెన్సీకి చట్టబద్ధత లేదు : జైట్లీ

Thu,February 1, 2018 12:35 PM

Crypto currencies are not legal tender, says Jaitley

న్యూఢిల్లీ : క్రిప్టోకరెన్సీని రూపుమాపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఇవాళ బడ్జెట్ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం వర్చువల్ కరెన్సీకి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఇటీవల బిట్‌కాయిట్ లాంటి క్రిప్టోకరెన్సీలు ప్రపంచవ్యాప్తంగా హల్‌చల్ సృష్టించాయి. దీంతో భారత్‌లోనూ వర్చువల్ కరెన్సీ పట్ల ఆసక్తి పెరిగింది. ఇప్పటికే చాలా మంది బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆర్బీఐ కూడా హెచ్చరికలు జారీ చేసింది. క్రిప్టోకరెన్సీల పట్ల జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించింది. క్రిప్టోకు చట్టబద్దత లేదని, దాన్ని రూపుమాపేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని జైట్లీ స్పష్టం చేశారు.

1558
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles