పోలింగ్ బూత్‌లో పేలిన నాటు బాంబు

Tue,February 27, 2018 09:41 AM

Crude bomb explodes at Nagaland polling booth

కోహిమా: నాగాలాండ్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి గాయపడ్డాడు. టిజిట్ నియోజకవర్గంలో ఉన్న పోలింగ్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. ఇవాళ ఉదయం 5.45 నిమిషాల ప్రాంతంలో ఆ బాంబు పేలింది. నాగాలాండ్‌లో మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2156 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అందులో సగం బూత్‌లు ప్రమాదకరమే అని ముందే ఊహించారు. అక్కడ భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలైంది. సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుంది.

938
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles