మాల్యా అప్పగింతపై కీలక వాదనలు

Tue,July 31, 2018 09:09 AM

crucial hearing in Mallya extradition case at UK court today

లండన్: ఎస్‌బీఐ బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కేసులో ఇవాళ లండన్ కోర్టులో కీలక వాదనలు జరగనున్నాయి. మాల్యాను తమకు అప్పగించాలని భారత్ డిమాండ్ చేస్తున్నది. ఈ కేసులో రెండు వైపుల న్యాయవాదులు కీలక డాక్యుమెంట్లను సమర్పించనున్నారు. వాస్తవానికి జూలై మధ్యలో జరగాల్సిన వాదలను నేటికి వాయిదా వేశారు. అయితే అప్పగింత కేసులో మాత్రం తుది తీర్పు ఈ ఏడాది చివర్లో వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నాం 2.30 గంటలకు కోర్టులో వాదనలు మొదలవుతాయి. వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులోని చీఫ్ మెజిస్ట్రేట్ జడ్జి ఎమ్మా ఆర్బత్‌నాట్ ఈ వాదనలు విననున్నారు.

741
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles