పుల్వామా దాడి.. బ‌స్సు నుంచి భార్య‌కు వీడియో పంపిన‌ జ‌వాను

Sat,February 23, 2019 10:37 AM

CRPF martyrs wife shares last video sent by husband minutes before Pulwama attack

హైద‌రాబాద్: పుల్వామాలో ఈనెల 14వ తేదీన సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై కారు బాంబుతో ఆత్మాహుతి దాడి జ‌ర‌గడానికి కొన్ని క్ష‌ణాల ముందు జ‌వాన్ సుక్‌జింద‌ర్ సింగ్ త‌న భార్య‌కు ఓ వీడియో సందేశం పంపాడు. ఆ వీడియో ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. 76వ బెటాలియ‌న్‌కు చెందిన జ‌వాను సుక్‌జింద‌ర్ సింగ్‌.. ఆత్మాహుతి దాడి ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయాడు . ఆ జ‌వాను ప్ర‌యాణించిన బ‌స్సునే ఉగ్ర‌వాది ఆదిల్ పేల్చేశాడు. అయితే ఈ ఘ‌ట‌న‌కు కొన్ని క్ష‌ణాల ముందు జ‌వాన్ సుక్‌జింద‌ర్ ఆ బ‌స్సులో ఓ వీడియో తీశాడు. రోడ్డుకు ఇరువైపుల ఉన్న మంచు అందాల‌ను అత‌ను షూట్ చేశాడు. బ‌స్సులో ఉన్న స‌హ‌చ‌రుల‌ను కూడా ఆ వీడియోలో అత‌ను షూట్ చేశాడు. వీడియోలో ఆ జ‌వాన్ కూడా క‌నిపిస్తాడు. ఆ త‌ర్వాత ఆ వీడియోను భార్య‌కు ఫార్వ‌ర్డ్‌ చేశాడు. కానీ దాడి జ‌రిగిన రెండు రోజుల త‌ర్వాత ఆమె వీడియో చూసిన‌ట్లు తెలుస్తోంది. పంజాబ్‌కు చెందిన జ‌వాన్ సుక్‌జింద‌ర్ త‌న భార్య‌కు పంపిన చివ‌రి సందేశం అదే. ఆ జంట‌కు ఏడు నెల‌ల కుమారుడు కూడా ఉన్నాడు. 2003లో సింగ్ సీఆర్‌పీఎఫ్‌లో చేరాడు. 19 ఏళ్ల వ‌య‌సులో అత‌ను విధుల్లో చేరాడు. కేవ‌లం 8 నెల‌ల క్రిత‌మే అత‌ను హెడ్‌కానిస్టేబుల్‌గా ప్ర‌మోట్ అయ్యాడు.

7518
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles