శ్రీనగర్ : సీఆర్పీఎఫ్ జవాను ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే..తన మానవత్వాన్ని చాటుకున్నాడు. సీఆర్పీఎఫ్ హవాల్దార్ అయిన ఇక్బాల్ సింగ్ పక్షవాతం ఉన్న చిన్నారికి తన టిఫిన్ బాక్సులోని అన్నం స్వయంగా తినిపించాడు.
ఇక్బాల్ సింగ్ ఫిబ్రవరి 14న (పుల్వామా ఉగ్రదాడి రోజు)చిన్నారి సీఆర్పీఎఫ్ వాహనాన్ని డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు. అయితే మార్గమధ్యలో బిక్కుబిక్కుమంటూ చూస్తున్న పక్షవాతం ఉన్న చిన్నారిని చూసి..తన వాహనాన్ని ఆపేశాడు. వెంటనే తన కోసం తెచ్చుకున్న టిఫిన్ బాక్సు తీసి అందులో ఉన్న ఆహారాన్ని ఆ చిన్నారికి స్వయంగా తన చేతులతో తినిపించాడు. చిన్నారి ముఖాన్ని తుడుస్తూ..అతని దాహాన్ని తీర్చాడు. ఇక్బాల్ సింగ్ మానవత్వంతో ఆ చిన్నారి ఆకలి తీర్చిన వీడియోను తోటి సిబ్బంది ట్విట్టర్లో పోస్ట్ చేయగా..ఆ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. చిన్నారి ఆకలి తీర్చి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన ఇక్బాల్ సింగ్ను..ఆర్మీ డిస్క్ అండ్ కమ్మండేషన్ సర్టిఫికెట్తో సత్కరించింది.