పాఠశాలకు కూర్చీలు బహుకరించిన సీఆర్‌పీఎఫ్

Tue,November 29, 2016 11:11 AM

CRPF donates classroom chairs to a school

శ్రీనగర్: సీఆర్‌పీఎఫ్ 132 పారామిలటరీ బెటాలియన్‌కు చెందిన అధికారులు ఓ పాఠశాలకు కూర్చీలను బహుకరించారు. జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లోని క్రాల్‌కుద్ ప్రాంతంలో గల ఓ పాఠశాల 2014లో సంభవించిన వరదల కారణంగా దెబ్బతింది. సమస్యపై స్పందించిన సీఆర్‌పీఎఫ్ పాఠశాలలో కనీస వసతుల కల్పనకు పూనుకుంది. ఈ క్రమంలో భాగంగానే భద్రతా సిబ్బంది పాఠశాలకు నేడు కూర్చీలను అందజేసింది. ఈ చర్యపై ఆ పాఠశాల విద్యార్థిని స్పందిస్తూ.. వసతుల లేమితో పాఠశాలలో విద్యనభ్యసించడం కష్టంగా ఉంది. పాఠశాలకు కూర్చీలు అందజేసిన సీఆర్‌పీఎఫ్‌కు ఏ విధంగా కృతజ్ఞతలు తెలపాలో తెలియటం లేదని పేర్కొంది.

1291
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles