పోటీకి నిరాకరించిన వీరేంద్ర సెహ్వాగ్

Fri,March 15, 2019 10:29 AM

Cricketer Virender Sehwag Declined Offer To Contest Polls In Delhi

న్యూఢిల్లీ : 17వ లోక్‌సభ ఎన్నికల్లో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పోటీ చేస్తారని వార్తలు షికారు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సెహ్వాగ్ నిరాకరించాడని ఢిల్లీకి చెందిన బీజేపీ నాయకుడొకరు స్పష్టం చేశారు. పశ్చిమ ఢిల్లీ నుంచి సెహ్వాగ్‌ను బరిలో దింపాలని బీజేపీ భావించిందని, అందుకు ఆయన ఆసక్తి చూపడం లేదన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఎన్నికల్లో పోటీ చేయనని సెహ్వాగ్ సున్నితంగా తిరస్కరించాడని తెలిపారు. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన, ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తి లేదని సెహ్వాగ్ చెప్పినట్లు బీజేపీ నేత పేర్కొన్నారు. వీరేంద్ర సెహ్వాగ్ బీజేపీ టికెట్ మీద హర్యానాలోని రోహతక్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఈ ఏడాది ఫిబ్రవరిలో వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లో సెహ్వాగ్ స్పందిస్తూ.. అవన్నీ వదంతులేనని కొట్టిపారేశారు.

1680
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles