మానిక్ సర్కార్‌కు రెడ్ సిగ్నల్

Sat,March 3, 2018 12:20 PM

CPM gets red signal from BJP in Tripura

అగర్తలా: త్రిపురలో మానిక్ సర్కార్ ప్రభుత్వానికి రెడ్ సిగ్నల్ పడింది. ఎర్ర దళం కంచుకోటలో.. కమల దళం వికసించింది. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ప్రచారం.. ఆ రాష్ట్రంలో బీజేపీకి కలిసివచ్చింది. ప్రధాని మోదీ ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం నాలుగు సార్లు ర్యాలీ నిర్వహించారు. ఆ ప్రతిఫలం ఇవాళ వెల్లడైన ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది.

మానిక్‌ను కాదు, హీరాను ఎన్నుకోవాలని మోదీ తన ప్రచారంలో ఆ రాష్ట్ర ప్రజలను కోరారు. హీరాకు ప్రధాని కొత్త నిర్వచనం ఇచ్చారు. హెచ్ అంటే హైవే, ఐ అంటే ఇంటర్నెట్, ఆర్ అంటే రోడ్‌వేస్, ఏ అంటే ఎయిర్‌వేస్ అంటూ మోదీ ప్రచారం సమయంలో అన్నారు. హీరా ఓ వజ్రం అని, మానిక్ ఓ రత్నం అని, కానీ హీరాను ఎన్నుకోవాలని మోదీ చేసిన ప్రచారం ఈశాన్య రాష్ర్టాన్ని కైవసం చేసుకునే అవకాశం కల్పించింది.

దాదాపు రెండు దశాబ్ధాల పాటు త్రిపురను ఏలిన లెఫ్ట్ పార్టీకి ఇప్పుడు బీజేపీ షాక్ ఇచ్చింది. మానిక్ సర్కార్ నాలుగు సార్లు ఆ రాష్ర్టానికి సీఎంగా చేశారు. అయితే తాజా ఫలితాలు మానిక్‌కు ఊహించని షాక్ ఇచ్చాయి. 59 సీట్ల త్రిపురలో బీజేపీ 40, లెఫ్ట్ 19 సీట్ల ఆధిక్యంలో దూసుకెళ్లుతున్నాయి.
మ‌ధ్యాహ్నం ఒంటిగంట వ‌ర‌కు అందిన ఫ‌లితాల ఆధారంగా చూస్తే త్రిపుర‌లో బీజేపీ 7 స్థానాల్లో విజ‌యం సాధించి, 33 స్థానాల్లో ముందంజ‌లో ఉంది. వామ‌ప‌క్షాలు 2 స్థానాల్లో గెలువ‌గా 16 సీట్ల‌లో ఆదిక్య‌త‌ను క‌న‌బ‌ర‌స్తున్నాయి. దీనిని బ‌ట్టి త్రిపురలో ఎర్ర‌ద‌ళం కోటలో క‌మ‌లద‌ళం జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌నిపిస్తున్న‌ది.

1987
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles