ఆన్‌లైన్‌లో ‘ఆవుపేడ’.. హాట్‌కేకుల్లా కొనుగోలు

Mon,December 28, 2015 04:11 PM


Cow Dung Patties Selling Like Hot Cakes Online

న్యూఢిల్లీ : ఆవుపేడ ఆన్‌లైన్‌లో హాట్‌కేకుల్లా అమ్ముడుపోతుంది. ఇది నిజమండి.. ఒకావిడకు వచ్చిన ఈ ఆలోచన వల్లనే ఆవుపేడ ఆన్‌లైన్‌లోకి ఎక్కింది. ఒకప్పుడు.. ఇప్పటికీ గ్రామాల్లో ఆవు పేడను నీళ్లలో కలిపి వాకిట్లో కల్లాపి చల్లుతుంటారు. ఇంకా పేడతో పిడకలు చేసి వాటిని ఎండబెట్టి వంట చేసుకోవడానికి కూడా ఉపయోగిస్తుంటారు. పట్టణ ప్రాంతాల్లో కల్లాపి అంటే ఎరుగరు. ఒక వేళ తెలిసినప్పటికీ పేడ దొరకడం కష్టం. కానీ ఇప్పుడు మాత్రం ఆవుపేడను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి ఇంటి ముందు కల్లాపి చల్లుకుంటున్నారు.

అంటే నెటిజన్లకు ఆవు పేడను వెతుక్కునే పనిని తప్పించారు ఈవిడ. అయితే ఈవిడ ఏవరు? ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? అంటే ఢిల్లీకి వెళ్లాల్సిందే! ఈవిడ.. ఢిల్లీకి చెందిన ఆసియా క్రాఫ్ట్స్ యజమాని ప్రీతి కర్లా. ఈ ఆసియా క్రాఫ్ట్స్ పూజా సామాగ్రిని విక్రయిస్తుంది. ఈ క్రమంలో ప్రీతి కర్లా రోజూ భక్తి చానెళ్లను చూస్తుంది. అయితే ఒక రోజు ఓ స్వామివారు ఆవు పేడ పిడకలను కాల్చాలని, పేడతో వాకిట్లో సానిపే చల్లాలని చెప్పాడట. భక్త జనులు కూడా స్వామి వారి సూచనలను స్వీకరిస్తుంటారు.

పట్టణ ప్రాంతాల్లో పేడ దొరకడం కష్టం. ఈ క్రమంలో ఈవిడ ఆన్‌లైన్‌లో పేడ అమ్మాలని నిర్ణయించుకుందట. హస్తిన శివార్లలోని గ్రామాల్లో పేడను, పిడకలను సేకరించి అమ్మకం ప్రారంభించింది. 8 పిడకల ప్యాక్‌ను రూ. 419కు అమ్ముతుంది. ప్రతి నెల 3000 ప్యాకెట్లకు పైగా విక్రయిస్తుంది ఆసియా క్రాఫ్ట్స్. విదేశాల్లోని హిందూ దేవాలయాల నుంచి కూడా ఆసియా క్రాఫ్ట్స్‌కు ఆర్డర్లు వస్తున్నాయట. అమెజాన్, ఈబే ద్వారా విక్రయాలు జరుపుతుంది ప్రీతి కర్లా.

image

1581
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles