ఛీ.. ఛీ.. ఆ జంట రోడ్డుపైనే ఇలా..వీడియో!

Sun,June 10, 2018 12:48 PM

Couple in Mumbai accused of having sex on road

ముంబై: రోడ్లపై వందల వాహనాలు అటూ ఇటూ వెళ్తున్నాయి. వేల సంఖ్యలో జనం తిరుగుతున్నారు. అయినా ఆ జంట ఇవేమీ పట్టించుకోలేదు. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే సెక్స్‌లో పాల్గొన్నారు. రోడ్డుపై వెళ్తున్నవాళ్లు ఆగి వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. అవికాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. ముంబైలోని మెరైన్ డ్రైవ్ ఏరియా నారిమన్ పాయింట్ దగ్గర గురువారం ఈ ఘటన జరిగింది. ఎయిరిండియా బిల్డింగ్, మరైన్ హోటెల్ ప్లాజా మధ్య బిజీ రోడ్డులో ఆ జంట ఈ పని చేయడం విశేషం.

మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ హెడ్‌క్వార్టర్స్‌కు కూతవేటు దూరంలోనే ఈ ప్రాంతం ఉంది. కొందరు వీళ్ల వీడియోలు తీయగా.. మరికొందరు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. మరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు వచ్చారు. వాళ్లను చూడగానే ఆ జంట వెంటనే సర్దుకొని రోడ్డుకు అవతలివైపు వెళ్లిపోయారు. అయితే వాళ్లను వెంబడించిన పోలీసులు సదరు యువతిని అదుపులోకి తీసుకున్నారు.

విదేశీ వ్యక్తి అయిన యువకుడు మాత్రం దొరకలేదు. తాను గోవా నుంచి వచ్చానని ఆ యువతి చెప్పింది. వీళ్లపై ఎలాంటి కేసులు ఇంకా నమోదు చేయలేదు. అయితే సదరు యువతి మానసిక స్థితి సరిగా లేదని భావించిన పోలీసులు ఆమెను మహిళా సురక్షా కేంద్రానికి తరలించారు. దగ్గర్లోనీ సీసీటీవీ కెమెరాల ద్వారా సదరు యువకుడిని గాలిస్తున్నారు.18886
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles