ప్రేమ పెళ్లి చేసుకున్నారని మూత్రం తాగించారు..

Wed,August 1, 2018 11:41 AM

Couple forced to drink urine for marrying against parents wishes in Madhya Pradesh

భోపాల్ : ఓ నవ దంపతులకు నరకం చూపించారు. ఎందుకంటే వారు ప్రేమించి పెళ్లి చేసుకోవడమే పాపమైంది. దంపతులిద్దరిని కిడ్నాప్ చేసి.. దారుణంగా చితకబాది.. ఆ తర్వాత గుండు గీయించి.. మూత్రం తాగించారు. ఈ అమానవీయ సంఘటన మధ్యప్రదేశ్ అలీరాజ్‌పూర్ జిల్లాలోని హర్‌దాస్‌పూర్‌లో జులై 25న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.

హర్‌దాస్‌పూర్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువకుడు, 21 ఏళ్ల యువతి గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ఈ ఏడాది మే నెలలో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండు నెలల పాటు గుజరాత్‌లో ఉన్న ఈ నవ దంపతులు.. ఇటీవలే అలీరాజ్‌పూర్‌లోని తన మామ నివాసానికి(యువకుడి మేనమామ) చేరుకున్నారు.

విషయం తెలుసుకున్న వధువు తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని దంపతులను జులై 25న కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత నవదంపతులను తీవ్రంగా కొట్టి.. గుండు గీయించారు. అందరూ చూస్తుండగానే వీరిద్దరికి మూత్రం తాగించారు. అయితే ఈ దృశ్యాన్ని కొందరు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి.. సామాజిక మాధ్యమాలలో వైరల్ చేశారు. ఇక బాధిత దంపతులిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఈ సందర్భంగా వరుడు మాట్లాడుతూ.. ప్రేమ వివాహం చేసుకున్నందుకు తన భార్య కుటుంబానికి రూ. 70 వేలు, రెండు మేకలను శిక్ష కింద ఇచ్చామని తెలిపాడు. అయినప్పటికీ తమపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయని బోరున విలపించాడు.

3188
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS