వినూత్న పెండ్లి.. గద్దలా ఎగురుకుంటూ వచ్చి.. వీడియో

Mon,July 16, 2018 03:00 PM

couple entered their wedding venue in a giant eagle video goes viral

అందరిలా సాదాసీదాగా చేస్తే ఏముంటింది కిక్కు. అందుకే ఈ జనరేషన్ యూత్ ప్రతి పనిలో వైవిద్యాన్ని వెతుకుతున్నారు. అలాగే ప్రవర్తిస్తున్నారు. నిర్మొహమాటంగా తమకు ఏది చేయాలనిపిస్తే అది చేస్తున్నారు. తమ చదువు విషయంలో కాని.. కెరీర్ విషయంలో కాని.. ఎంజాయ్‌మెంట్ విషయంలో కాని.. పెండ్లి విషయంలో కాని.. దేంట్లోనైనా మెదడుకు పదును పెట్టి కొత్త కొత్త ఆలోచనలతో దూసుకెళ్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు మనం చదవబోయే వార్త కూడా అటువంటిదే.

ఓ జంట తమ పెండ్లి వేదిక మీదికి కారులో రాలేదు. వేరే ఏ వాహనంలో రాలేదు. దేనిమీద వచ్చారో తెలుసా? ఏకంగా గద్దమీద వచ్చారు. వాళ్ల పెండ్లి కోసం సపరేట్‌గా గద్ద బొమ్మతో తయారుచేసిన బోన్‌లో నిలబడి పెండ్లి మండపానికి వచ్చారు. పెద్ద క్రేన్ సాయంతో దాన్ని పైనుంచి డైరెక్ట్‌గా పెండ్లి మండపంలో దించారు. బ్యాక్ గ్రౌండ్‌లో పెండ్లి మండపంలో మాత్రం మహమ్మద్ రఫీ పాడిన 'బాహరో ఫూల్ బర్సావో' అనే పాట ప్లే అవుతూ ఉండగా.. వీళ్లు దివి నుంచి భూలోకంలోకి దిగినట్లుగా పెండ్లి మండపంలోకి దిగారు. ఇక.. ఈ జంట వినూత్న ప్రయత్నానికి పెండ్లి పెద్దలు, బంధువులు, స్నేహితులు ఫిదా అయిపోయారు.

ఇక.. ఈ వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్‌లో షేర్ చేయడంతో ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతే కాదు.. ఆ వీడియోను తెగ మెచ్చుకుంటున్న నెటిజన్లు, సూపర్ ఐడియా బాసు, వాట్ ఆన్ ఐడియా, నువ్వు కేకపో.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.


3116
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS