చిన్నారిని కారులో నుంచి విసిరిన దంపతుల అరెస్ట్

Wed,June 13, 2018 08:35 PM

Couple arrested for throwing their baby out of car in UP

ముజఫర్ నగర్ : కన్న బిడ్డను కారులో నుంచి బయటకు విసిరేసిన దంపతులను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. సార్వేర్ (26), కైసర్ దంపతులు జూన్ 6న తమకు పుట్టిన బిడ్డను కారులో వెళ్తుండగా..అందులో నుంచి బయటకు విసిరేశారు. అయితే పసికందు రోడ్డు పక్కనే ఏడుస్తూ ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. దంపతులు తమ బిడ్డను కారులో నుంచి విసిరిన వీడియో అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది.

సీసీ పుటేజీ ఆధారంగా కారు నంబర్‌ను గుర్తించిన పోలీసులు..దర్యాప్తు వేగవంతం చేసి వారిని పట్టుకున్నారు. ఈ విషయమై పోలీసులు దంపలిద్దరినీ విచారించగా..తమకు ఫిబ్రవరిలోనే పెళ్లయిందని.. అప్పుడే బిడ్డ పుట్టడంతో సమాజానికి ఏం చెప్పుకోవాలో తెలియక ఈ పని చేశామని చెప్పారని ముజఫర్ నగర్ ఎస్‌ఎస్‌పీ అనంత్ దేవ్ తెలిపారు. ఐపీసీ సెక్షన్ 317 కింద కేసు నమోదు చేసి దంపతులిద్దరినీ అరెస్ట్ చేశామని వెల్లడించారు. చిన్నారికి ఆస్పత్రిలో వైద్యులు చికిత్సనందిస్తున్నారు.

5535
Follow us on : Facebook | Twitter
Tags
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS