బీజేపీని గంగలో నిమజ్జనం చేయాలి

Sat,January 19, 2019 01:23 PM

Country is in danger and farmers are in a bad state says Sharad Yadav

కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కోల్‌కతాలో నిర్వహించిన విపక్షాల ఐక్య ర్యాలీలో లోక్‌తాంత్రిక్ జనతాదళ్ పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం దేశంలో తీవ్రమైన సంక్షోభం ఉందన్నారు. రైతులు తీవ్రమైన నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు వల్ల వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. దాదాపు 7 కోట్ల మంది ప్రజలు ఉపాధి కోల్పోయారు. దేశ స్వేచ్ఛాస్వాతంత్య్రాలను బీజేపీ తన గుప్పిట పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గంగలో నిమజ్జనం చేయాలి. మరో రాజకీయ విప్లవానికి కోల్‌కతా నాంది పలికిందన్నారు. బీజేపీ అవినీతికి రఫేల్ కుంభకోణం ఒక నిదర్శనం అని శరద్ యాదవ్ చెప్పారు.

1437
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles