10 రాష్ట్రాల్లో బైపోల్స్‌.. ప్రారంభ‌మైన ఓట్ల లెక్కింపు

Thu,May 31, 2018 08:05 AM

counting of votes begin in Kairana for by polls held recently

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నాలుగు లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికలకు ఇవాళ కౌంటింగ్ జరగనున్నది. లోక్‌సభ స్థానాల్లో యూపీలోని కైరానా, మహారాష్ట్రలోని భాంద్రా-గోండియా, పల్గార్, నాగాలాండ్‌లోని నాగాలాండ్ పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. అసెంబ్లీ స్థానాల్లో పాలుస్ కడేగావ్(మహారాష్ట్ర), నూర్‌పుర్(ఉత్తరప్రదేశ్), జోకిహట్(బీహార్), గోమియా, సిల్లీ(జార్ఖండ్), చెంగనూరు(కేరళ), ఆంపటి(మేఘాలయా), షాకోట్(పంజాబ్), తరలి(ఉత్తరాఖండ్), మహేశ్తల(పశ్చిమ బెంగాల్) ఉన్నాయి. ఇవాళ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. భారతీయ జనతా పార్టీకి ఉప ఎన్నికలు లిట్మస్ పరీక్షగా మారనున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ ఫలితాలు కీలకంగా నిలవనున్నాయి. అయితే లోక్‌సభలో మెజారిటీ నిలుపుకునేందుకు.. ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావాల్సిన అవసరం ఉంది. ఇటీవల గోరఖ్‌పూర్, ఫుల్‌పూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడింది. దాంతో కైరానా స్థానం కోసం ఈసారి ఆ పార్టీ తీవ్ర కసరత్తు చేసింది. మహారాష్ట్రలోని పల్గార్, భాంద్రా స్థానాలకు బీజేపీ, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీపడుతున్నాయి.

1533
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles