ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో లెక్కబెట్టడం మా పని కాదు: ఐఏఎఫ్ చీఫ్

Mon,March 4, 2019 01:14 PM

Counting human casualties not our work we hit our target says Air Chief Marshal BS Dhanoa

కోయంబత్తూర్: పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాదుల స్థావరంపై జరిపిన దాడి విజయవంతమైందని ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా స్పష్టం చేశారు. తమ లక్ష్యాన్ని ఛేదించామని ఆయన చెప్పారు. అయితే ఈ దాడుల్లో ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయారన్నది చెప్పలేదు. మా పని లక్ష్యాలను ఛేదించడమే తప్ప.. ఎంత మంది చనిపోయారో లెక్కబెట్టడం కాదు అని ధనోవా అన్నారు. చనిపోయిన వారి సంఖ్యపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు స్పష్టత లేదు. ఆ పని ప్రభుత్వం చేస్తుంది. మేము మృతులను లెక్కబెట్టం. ఛేదించిన లక్ష్యాలను మాత్రమే లెక్కబెడతాం అని ఎయిర్ చీఫ్ స్పష్టం చేశారు.


అసలు దాడులు జరిగాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారికి కూడా ధనోవా సమాధానమిచ్చారు. ఒకవేళ దాడులు జరగకపోతే పాకిస్థాన్ ఎందుకు ఎదురు దాడికి దిగుతుంది అని ఆయన ప్రశ్నించారు. ఇక ఎఫ్-16 విమానాలను తరమడానికి మిగ్-21 బైసన్‌లను పంపించడాన్ని కూడా ఆయన సమర్థించుకున్నారు. ముందే ప్లాన్ వేసుకున్న ఆపరేషన్ అయితే ఎంపిక చేసిన విమానాలను పంపిస్తాం. బాలాకోట్‌లో జరిగిన దాడి ఇలాంటిదే. అదే అప్పటికప్పుడు జరిగే దాడిని తిప్పికొట్టడానికి అందుబాటులో ఉన్న ఏ ఫైటర్ జెట్‌నైనా పంపిస్తాం. అన్ని ఫైటర్ జెట్స్.. శత్రువులతో పోరాడే సామర్థ్యం ఉన్నవే అని ధనోవా అన్నారు.
ఇక వింగ్ కమాండర్ అభినందన్‌కు అవసరమైన చికిత్సలన్నీ అందిస్తున్నామని, ఆయన మెడికల్ ఫిట్‌నెస్ సాధిస్తే మళ్లీ ఫైటర్ జెట్ కాక్‌పిట్‌లో కూర్చుంటారని స్పష్టం చేశారు.

1928
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles