టెక్నాల‌జీతో పార‌ద‌ర్శ‌క‌త తీసుకువ‌చ్చాం: మోదీ

Tue,November 20, 2018 01:42 PM

జాబువా: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఇవాళ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడే ఆ పార్టీ దేశాన్ని అవినీతితో నాశ‌నం చేసింద‌న్నారు. ఆ అవినీతి కూపం నుంచి దేశాన్ని బ‌య‌ట‌కు తెచ్చేందుకు నిరంత‌రం ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని, ఆ ప్ర‌భావం ఇప్పుడు క‌నిపిస్తుంద‌ని అన్నారు. టెక్నాల‌జీ ద్వారా యావ‌త్ వ్య‌వ‌స్థ‌లో పార‌ద‌ర్శ‌క‌త తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌న్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న స‌మ‌యంలో ఈ రాష్ట్రం ఎలా ఉండేదో ప్ర‌జ‌ల‌కు తెలుసు అని మోదీ అన్నారు. ప్ర‌జ‌ల క్షేమం కాంక్షించ‌ని కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి అవ‌స‌రం లేద‌ని మోదీ విమ‌ర్శించారు.

736
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles