వాజ్‌పేయికి నివాళులు అర్పించలేదని కార్పొరేటర్‌పై దాడి

Fri,August 17, 2018 05:33 PM

Corporator attacked after he refused to pay homage to Vajpayee in Aurangabad

ఔరంగాబాద్: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతికి సంతాపం ప్రకటించడానికి నిరాకరించాడని ఓ కార్పొరేటర్‌పై దాడి చేశారు. ఈ ఘటన శుక్రవారం ఔరంగాబాద్‌లో జరిగింది. ఆలిండియా మజ్లిసె ఇత్తెహాదుల్ ముస్లమీన్ (ఏఐఎంఐఎం)కు చెందిన కార్పొరేటర్ సయ్యద్ మతిన్‌పై శివసేన, బీజేపీకి చెందిన కార్పొరేటర్లు దాడి చేశారు. వాజ్‌పేయి మృతికి సంతాపం ప్రకటిస్తూ చేసిన తీర్మానాన్ని మతిన్ వ్యతిరేకించారు. దీంతో సాటి కార్పొరేటర్లంతా కలిసి అతనిపై దాడి చేసినట్లు మరాఠీ న్యూస్‌పేపర్ సామ్నా వెల్లడించింది. మొదట శివసేన కార్పొరేటర్లు అతన్ని చితకబాదారు. వాళ్లకు బీజేపీ కార్పొరేటర్ల జత కలిశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని మతిన్‌ను విడిపించారు. ఔరంగాబాద్ కార్పొరేషన్ సమావేశంలో ఈ ఘటన జరగగా.. మతిన్‌ను అక్కడున్న కుర్చీలు, టేబుళ్ల మధ్య వేసి చితకబాదారు. దీంతో అతని తలకు గాయమైంది. ఈ ఘటన తర్వాత బీజేపీ నేత భావురావ్ దేశ్‌ముఖ్‌కు చెందిన కారును ఎంఐఎం మద్దతుదారులు ధ్వంసం చేశారు. ఆయన డ్రైవర్‌ను కారులో నుంచి లాగి దాడి చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర భద్రతను భారీగా పెంచారు.

4296
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles