బ్యాంకులో పట్టపగలే దోపిడీ.. వీడియో

Sat,October 13, 2018 11:35 AM

corporation bank being robbed in Delhi Khaira yesterday by armed assailants

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే బ్యాంకులోకి చొరబడిన దొంగలు.. మారణాయుధాలతో బెదిరించి నగదును దోచుకెళ్లారు. ఈ సంఘటన ఢిల్లీ ఖైరాలోని కార్పొరేషన్ బ్యాంకులో శుక్రవారం చోటు చేసుకుంది. అయితే బ్యాంకులోకి ప్రవేశించిన దొంగలు.. అక్కడున్న కస్టమర్లు, సిబ్బందిని తుపాకులు, కత్తులతో బెదిరించారు. ఆ తర్వాత క్యాషియర్‌ను తుపాకీతో కాల్చిచంపారు. ఇక ముఖాలకు ముసుగులు ధరించిన దొంగలు.. దొరికినంత నగదును దోచుకెళ్లారు. ఈ తతంగమంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. ఈ దోపిడీపై బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.3850
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles