మీటూ దెబ్బకు కొత్త పుంతలు తొక్కుతున్న సంస్థలు

Mon,November 5, 2018 07:18 AM

corporate Companies approach social media for new appointments

ముంబై: మీటూ సెగ ఒక సినిమా ఇండస్ట్రీనే కాదు కార్పొరేట్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్నది. ఇప్పటికే పలువురు మహిళా సిబ్బంది లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న విషయాన్ని బట్టబయలు చేస్తుండటంతో కార్పొరేట్ సంస్థలు ముందస్తు చర్యలకు ఉపక్రమించారు. ఉన్నత స్థాయి ఉద్యోగులను తీసుకోవడంలో సంస్థలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. వారి బ్యాక్‌గ్రౌండ్, వారి సోషల్ మీడియాను పరిశీలించిన తర్వాతనే ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. సోషల్ మీడియాలో వారు పెట్టిన పోస్ట్‌ల ద్వారా వారి ప్రవర్తన, వ్యక్తిత్వ విషయాల ఆధారంగా వారిపై ఒక అవగాహనకు వస్తున్నాయి సంస్థలు. ప్రస్తుతం ఉద్యోగ నియామకాల్లో సోషల్ మీడియా కీలక స్థానం పోషిస్తున్నది..వారి అనుభవం కంటే ప్రవర్తన, వ్యక్తిత్వ విషయాలకు కార్పొరేట్ సంస్థలు పెద్దపీట వేస్తున్నాయని టీమ్‌లీస్ సర్వీసెస్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ నీతి శర్మ తెలిపారు. వారి కోపతాపాలతోపాటు నడక, చదువు, పరిస్థితులకు తగ్గట్టుగా ఆయా వ్యక్తులు అనుసరిస్తున్న పూర్తి స్థాయి వివరాలను తెలుసుకోవడానికి సోషల్ మీడియా ఆయుధంగా పనిచేస్తున్నదన్నారు. చెడ్డ ఉద్యోగులను లేదా మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని వదిలించుకోవడానికి కంపెనీలు వీటిపై ఆధారపడుతున్నాయని చెప్పారు.

అంతర్జాతీయంగా పలు సంస్థల్లో పనిచేస్తున్న సీనియర్, మధ్యస్థాయి ఉద్యోగుల వ్యక్తిగత విషయాలను ఈ విధంగా తెలుసుకుంటున్నాయి. మానవ వనరులు లేదా రిపోర్టింగ్ మేనేజర్ల ద్వారా గ్లోబల్ కంపెనీలు నియమించుకునే వారి బ్యాక్‌గ్రౌండ్‌ను పరిశీలించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా గతంలో వారు పనిచేసిన సంస్థల్లో ఉన్న రిసిప్షనిస్ట్, కారు డ్రైవర్, సెక్యూరిటీ గార్డ్, మహిళా సహ ఉద్యోగులను సంప్రదించి వారి నుంచి కీలక సమాచారం సేకరిస్తున్నట్లు ఆమె చెప్పారు. మల్టీనేషనల్స్, అతిపెద్ద కార్పొరేట్లు, ప్రభుత్వరంగ సంస్థలు ఇలాంటి చర్యలకు పెద్దపీట వేస్తున్నాయి. అయినప్పటికీ ఎస్‌ఎంఈ/ఎంఎస్‌ఎంఈ/అనాధికార విభాగాల్లో పనిచేస్తున్న మహిళలపై లైంగిక ఆరోపణలు ఆగడం లేదు. ఉదాహరణకు సెక్యూర్ క్రెడెన్షియల్ సీఈవోగా నియమితులైన రాహుల్ బెల్వాల్కర్‌పై సంస్థ పలు విధాలుగా వివరాలు సేకరించిన తర్వాతనే నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

1205
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS