హీరో పోలీస్‌.. ప‌ది కిలోల బాంబును కిలోమీట‌ర్ మోసుకెళ్లాడు!

Sun,August 27, 2017 03:17 PM

భోపాల్‌: ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు.. ఏకంగా నాలుగు వంద‌ల మంది స్కూల్ విద్యార్థుల ప్రాణాలు కాపాడాడు మ‌ధ్యప్ర‌దేశ్‌లోని ఓ హెడ్ కానిస్టేబుల్‌. స్కూల్ ఆవ‌ర‌ణ‌లో ఉన్న ఓ ప‌ది కిలోల బాంబును కిలోమీట‌ర్ దూరం త‌న భుజాల‌పై మోసుకెళ్లాడు. అత‌ని పేరు అభిషేక్ ప‌టేల్‌. వ‌య‌సు 40 ఏళ్లు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని సాగ‌ర్‌లో ఉన్న ఓ స్కూల్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అక్క‌డ బాంబును నిర్వీర్యం చేసేవాళ్లెవ‌రూ లేక‌పోవ‌డంతో అభిషేక్ ఈ సాహ‌సం చేశాడు. 12 అంగుళాల పొడ‌వు, ప‌ది కిలోల బ‌రువున్న ఆ బాంబును దూరంగా తీసుకెళ్లాడు. ఎవ‌రూ లేని ప్ర‌దేశంలో ఆ బాంబును విసిరేశాడు. ఇప్పుడు అభిషేక్ అక్క‌డ హీరో అయిపోయాడు. అయితే ఈ బాంబు స్కూల్ ఆవ‌ర‌ణ‌లోకి ఎలా వ‌చ్చింద‌న్న‌ది ఇంకా తెలియ‌లేదు. దీనిపై విచార‌ణ జ‌రుగుతున్న‌ది. ఈ గ్రామానికి ద‌గ్గ‌ర్లోనే ఓ ఆర్మీ రేంజ్ ఉన్న‌ది. అక్క‌డి నుంచి ఈ బాంబును ఎవ‌రైనా తీసుకొచ్చి ఇక్క‌డ వ‌దిలేశారా అన్న దానిపై విచార‌ణ జ‌రుపుతున్నారు. ఎంతో సాహ‌సంతో బాంబు బారి నుంచి చిన్నారుల ప్రాణాల‌ను కాపాడిన అభిషేక్‌తోపాటు అత‌ని టీమ్‌కు ప్ర‌భుత్వం రివార్డు ప్ర‌క‌టించింది.

1077
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles