డ్యాన్స్‌తో ట్రాఫిక్ నియంత్రిస్తున్న హోంగార్డు

Tue,September 11, 2018 05:20 PM

COP CONTROL TRAFFIC THRU DANCE

అతడో కళాత్మక హృదయమున్న ట్రాఫిక్ హోంగార్డు. ఆడుతుపాడుతు పనిచేయడం అనే పిలాసఫీ బాగా నమ్ముతాడేమో. అందుకే డ్యూటీని లయబద్ధంగా ఓ నాట్యంలా చేస్తుంటాడు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో పనిచేసే 33 ఏండ్ల ప్రతాప్‌చంద్ర ఖండ్వాల్ సర్కిల్‌కు వచ్చే వాహనదారులు ఆయన విధివిన్యాసాలు చూసి సంబురపడుతుంటారు. ఎప్పుడూ ఉత్సాహంగా నవ్వుతూనవ్విస్తూ ట్రాఫిక్‌ను అదుపులో పెడుతుంటాడు. ఈ పద్ధతిని ఎందుకు ఎంచుకున్నావు అని అడిగితే.. మొదట్లో వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించేవారు కాదని, తన నాట్యవిన్యాసాలు చూసిన తర్వాత బుద్ధిగా చెప్పినట్టు నడచుకుంటున్నారని చెప్పాడు ఖండ్వాల్. అనుభవం, సాధన ద్వారా ఈ స్టెప్పులు నేర్చుకున్నానని చెప్పాడు ఈ భలేపోలీసు.90
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles