కూలర్ల హాయిలో సేదతీరుతున్న దేవుళ్లు..

Fri,May 10, 2019 01:57 PM

Coolers and fans installed at temples in Kanpur

లక్నో: ఉష్ణోగ్రతలు రోజురోజుకు అధికమౌతున్నాయి. ఎండల తీవ్రతకు తాళలేక వడదెబ్బకు గురై పలువురు మృత్యువాత పడుతున్నారు. బయటకు వెళ్లాల్సి వస్తే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా వైద్యులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూనే ఉన్నారు. పసిపిల్లలు, వృద్ధుల నుంచి పశువుల దాకా కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎండల తీవ్రత దేవుళ్లకు సైతం చేరింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గల దేవాలయాల్లో దేవుళ్ల విగ్రహాలకు ఆలయ నిర్వాహాకులు కూలర్స్‌ను, ఫ్యాన్స్‌ను ఏర్పాటు చేశారు. దీనిపై స్థానిక సిద్ది వినాయక గణేశ్‌ ఆలయ అర్చకులు సుర్జిత్‌ కుమార్‌ దూబే స్పందిస్తూ.. దేవుళ్లు సైతం మానవుల మాదిరిగానే ఎండ వేడిమిని అనుభూతిస్తున్నారు. అందువల్లే ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా దేవుళ్లకు పలుచని వస్ర్తాలతో అలంకరణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.


1830
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles