టీ కప్పు ఇవ్వాల్సినోడికి దేశాన్ని ఇచ్చారు.. చంద్రబాబు దీక్షలో వివాదాస్పద పోస్టర్

Mon,February 11, 2019 01:22 PM

controversial poster seen at Chandrababu Naidus Dharma Porata Deeksha

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు మోదీ సర్కార్ అన్యాయం చేసిందంటూ ఢిల్లీలో ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షకు దిగిన సంగతి తెలుసు కదా. ఆంధ్రా భవన్‌లో రోజంతా ఈ దీక్ష జరగనుంది. ఏపీకి ఇచ్చిన విభజన హామీలను అమలు చేయాలని బాబు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని మోదీ వివిధ ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపనల కోసం ఏపీకి వచ్చి తనను అటూ ఇటూ వాయించి వెళ్లిన మరుసటి రోజే బాబు ఈ దీక్ష చేస్తుండటం విశేషం. మోదీ రాజధర్మాన్ని పాటించడం లేదని బాబు విమర్శించారు. అయితే ఈ దీక్షలో ఏర్పాటు చేసిన ఓ పోస్టర్ దుమారం రేపుతున్నది. మోదీ పూర్వాశ్రమంలో చాయ్ అమ్మిన విషయాన్ని గుర్తు చేస్తూ ఓ ప్లకార్డును ఉంచారు. కడగాల్సిన టీ కప్పులను ఇవ్వాల్సినోడికి దేశాన్ని అప్పగించారు అని ఆ ప్లకార్డుపై రాసి ఉంది. ఇది తీవ్ర దుమారానికి దారి తీయడంతో టీడీపీ దీనిపై స్పందించింది. ఆ ప్లకార్డుతో తమకు సంబంధం లేదని ఆ పార్టీ చెప్పడం విశేషం. తమ పార్టీ కార్యకర్తలు ఆ ప్లకార్డును ఉంచలేదని చెప్పింది. ఇది సరి కాదు.. అలా చేయడం తప్పు. దాంతో మాకు సంబంధం లేదు అని ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు.

2905
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles