భార్యను హత్య చేసిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్

Wed,March 20, 2019 10:15 AM

Constable kills wife after heated argument in Jagadalpur

రాయ్‌పూర్ : ఎన్నికల విధులకు వెళ్లొద్దని అడ్డుకున్నందుకు భార్యను సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ హత్య చేశాడు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఈ నెల 16న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. కానిస్టేబుల్ గురువీర్ సింగ్ జగదల్‌పూర్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో తన భార్యతో కలిసి ఉంటున్నాడు. అయితే ఈ నెల 17న ఎన్నికల విధులకు కానిస్టేబుల్ వెళ్లాలి. ఎన్నికల విధులకు వెళ్లొద్దని 16వ తేదీ రాత్రి కానిస్టేబుల్‌తో భార్య అనుప్రియ గౌతమ్ గొడవ పడింది. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత ఆమెను గొంతు నులిమి చంపేశాడు కానిస్టేబుల్. అనంతరం పోలీసులకు సమాచారం అందించి.. తన భార్య ఆత్మహత్య చేసుకుందని గురువీర్ సింగ్ తెలిపాడు. మొత్తానికి పోలీసులు విచారణ చేపట్టగా అనుప్రియను కానిస్టేబులే చంపినట్లు తేలింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

2055
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles