దొంగల్ని పట్టుకోవాల్సిన పోలీసే.. గుడ్లు చోరీ చేశాడు!

Thu,July 26, 2018 02:06 PM

constable caught on CCTV over stolen eggs

తిరుపతి: దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే పట్టపగలు చోరీలకు పాల్పడుతున్నారు. విధుల్లో ఉన్న పోలీసు దొంగగా మారి దొంగతనం చేశాడు.అందులోనూ అతడు ఎత్తుకెళ్లిన సంఘటన గురించి తెలిస్తే నవ్వుకోవాల్సిందే. అతడు చోరీ చేసింది ఖరీదైన వస్తువులు, నగదు కూడా కాదు నాలుగు రూపాయల విలువ చేసే కోడిగుడ్లు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి సమీపంలో చోటు చేసుకుంది.


ఓ చికెన్ షాప్‌లో కోడిగుడ్లు కొనేందుకు వెళ్లిన కానిస్టేబుల్ అదును చూసుకొని నాలుగు కోడిగుడ్లు చోరీ చేశాడు. ఆ తరువాత ఎవరికీ కనిపించకుండా జేబులో పెట్టుకొని వెళ్లిపోయాడు. ఐతే కానిస్టేబుల్ చోరీ చేస్తున్న ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. తిరుపతిలోని కొర్లగుంటలో ఈ ఘటన జరిగింది. ఐతే తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఎవరనేది తెలియాల్సి ఉంది. డబ్బులు ఇవ్వకుండా అక్కడ నుంచి గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.

2506
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles