'భారత్ బచావో ర్యాలీ' వాయిదా

Wed,November 20, 2019 08:05 AM

న్యూఢిల్లీ: భారత్ బచావో ర్యాలీ వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపేందుకు ఈ నెల 30న కాంగ్రెస్ పార్టీ భారత్ బచావో ర్యాలీ తలపెట్టిన విషయం తెలిసిందే. కాగా అనివార్య కారణాలతో ర్యాలీని వాయిదా వేస్తున్నట్లు ఐఏసీసీ ప్రకటించింది. వచ్చే నెలలో భారత్ బచావో ర్యాలీ చేపట్టనున్నట్లు పేర్కొంది. ఢిల్లీ రాంలీలా మైదానంలో డిసెంబర్ 14వ తేదీన ఉదయం 11 గంటలకు నిరసన కార్యక్రమం జరగనున్నట్లు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కే. సీ. వేణుగోపాల్ వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై నవంబర్ 25వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిరసనలు తెలపాల్సిందిగా కాంగ్రెస్ తమ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఆర్థిక మందగమనం, నిరుద్యోగం ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనాలుగా ప్రతిపక్ష కాంగ్రెస్ పేర్కొంటున్న విషయం తెలిసిందే.

421
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles