విజ‌యాన్ని జీర్ణించుకోలేక‌పోతున్న‌ది.. ఓట‌మిని అంగీక‌రించ‌లేక‌పోతున్న‌ది

Wed,June 26, 2019 05:14 PM

congress unable to digest our victory, says pm modi

హైద‌రాబాద్: బీజేపీ విజ‌యాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక‌పోతున్న‌ద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. ఓటమిని వాళ్లు అంగీక‌రించ‌లేక‌పోతున్నార‌న్నారు. ప్ర‌జాస్వామ్యంలో ఇది ఆరోగ్య‌క‌ర‌మైన సంకేతం కాద‌న్నారు. ఒకే దేశం.. ఒకేసారి ఎన్నిక‌ల చ‌ర్చ అంశంలోనూ ఇదే నిర్లిప్త‌త క‌నిపించింద‌న్నారు. కొంద‌రు దీన్ని వ్య‌తిరేకించారు, కానీ ఇలాంటి అంశాల‌పై అభిప్రాయాలు వెలుబుచ్చ‌డం అత్యంత అవ‌స‌రం అన్నారు. ఓట‌ర్లు అత్యంత జాగ్ర‌త్త‌గా ఉన్నార‌ని, లోక్‌స‌భ‌లో, రాజ్య‌స‌భ‌లో ఏం జ‌రుగుతోందో వాళ్లుకు తెలుసు అని, ఇలాంటి అంశాల‌ను దృష్టిలో పెట్టుకుని, ఓట‌ర్లు ఓట్లు వేసిన‌ట్లు మోదీ చెప్పారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానం సంద‌ర్భంగా మోదీ మాట్లాడు.. న్యూ ఇండియా నినాదాన్ని కాంగ్రెస్ త‌ప్పుప‌డుతోంద‌న్నారు. వాళ్ల‌కు పాత భార‌తే కావాల అని ప్ర‌శ్నించారు. క్యాబినెట్ నిర్ణ‌య ప‌త్రాల‌ను మీడియా స‌మావేశంలోనే చింపేసేవారు, నౌక‌ల్లో విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లేవారు, ఎన్నో స్కామ్‌లు జ‌రిగాయి, తుక్డ్కే తుక్డ్కే గ్యాంగ్‌కు మ‌ద్ద‌తు ఇచ్చే పాత భార‌త‌మే కావాలా అని మోదీ అడిగారు. భార‌త్ అయిదు ట్రిలియ‌న్ల డాల‌ర్ల ఆర్థిక‌వ్య‌వ‌స్థ‌గా మార్చేందుకు ఎవ‌రూ వ్య‌తిరేకించ‌రు అని, కానీ దానికి కావాల్సిన స‌ల‌హాలు, సూచ‌న‌ల‌ను ఇవ్వాల‌న్నారు. జార్ఖండ్‌లో జ‌రిగిన మూక దాడి ఘ‌ట‌న‌ను మోదీ ఖండించారు. దాడుల‌కు జార్ఖండ్ కేంద్రమైంద‌న్న ఆరోప‌ణ‌లు స‌రికాద‌న్నారు. ఎన్ఆర్‌సీలో ఎందుకు క్రెడిట్ తీసుకోలేద‌ని, అస్సాంలో పౌర‌స‌త్వ స‌మీక్ష చేయాల‌ని మాజీ రాజీవ్ గాంధీ అంగీక‌రించిన‌ట్లు మోదీ చెప్పారు.

3388
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles