యూపీలో పూర్తి సామర్థ్యంతో బరిలోకి దిగుతాం: రాహుల్

Sun,January 13, 2019 01:39 AM

Congress Ready to Contest Solo in UP 2019 General Elections says rahul gandhi

లక్నో: యూపీలో ఎస్పీ-బీఎస్పీ పొత్తుపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దుబాయ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఎస్పీ-బీఎస్పీ నేతలు తీసుకున్న నిర్ణయం పట్ల తనకు అపూర్వ గౌరవం ఉందని చెప్పారు. అయితే ఉత్తరప్ర దేశ్‌లో తాము పూర్తి సామర్థ్యంతో బరిలోకి దిగుతామని తెలిపారు. మరోవైపు ఎస్పీ-బీఎస్పీ పొత్తుపై కాంగ్రెస్ యూపీ వ్యవహారాల ఇన్‌చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ ఢిల్లీలో మాట్లాడుతూ, ఇప్పుడే తాము ఏమీ చెప్పలేమని అన్నారు. లక్నోలో తమ స్పందనను సవివరంగా తెలియజేస్తామని చెప్పారు. అంతకుముందు ఆయన యూపీపీసీ చీఫ్ రాజ్‌బబ్బర్, యూపీ సీఎల్పీ నాయకుడు సంజయ్‌సింగ్, మాజీ ఎంపీ ప్రమోద్‌తివారీతో తన ఇంట్లో సమావేశమయ్యారు. మరోవైపు భోపాల్‌లో మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ మాట్లాడుతూ, బీజేపీని ఓడించేందుకు దేశమంతా పొత్తులు ఉండాలని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో బీజేపీకి కేవలం 31 శాతం ఓట్లు వచ్చాయని, అయినా అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిందని, కేవలం ఓట్లు చీలిపోవడం వల్లనే అది జరిగిందని కమల్‌నాథ్ గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఇతర పార్టీలను కూడగడుతున్న కాంగ్రెస్‌కు ఎస్పీ-బీఎస్పీ ప్రత్యేక పొత్తు పెద్ద ఎదురుదెబ్బ కాగలదని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు ఎస్పీ-బీఎస్పీ పొత్తును తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, ఆర్జేడీ స్వాగతించాయి.

720
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles