బీజేపీలో దమ్మున్నోళ్లు మీరు ఒక్కరే: రాహుల్ గాంధీ

Mon,February 4, 2019 05:02 PM

Congress President Rahul Gandhi praises Nitin Gadkari

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై ప్రశంసలు కురిపించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఈ మధ్య బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ సమావేశంలో గడ్కరీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాహుల్ ఓ ట్వీట్ చేశారు. గడ్కరీ జీ అభినందనలు.. బీజేపీలో మీరు ఒక్కరే దమ్మున్న వ్యక్తి. దయచేసి రాఫెల్ స్కాం, అనిల్ అంబానీ, రైతుల అసహాయత, సంస్థల విధ్వంసంపై కూడా స్పందించండి అంటూ రాహుల్ ఆ ట్వీట్‌లో గడ్కరీని కోరారు.


శనివారం ఏబీవీపీ సమావేశంలో పాల్గొన్న గడ్కరీ.. ఇంటి బాగోగులు చూసుకోలేని వ్యక్తి దేశాన్ని ఏం బాగు చేయలేడు అని అన్నారు. నిజానికి బీజేపీ కోసం పని చేయాలని అనుకుంటున్న వ్యక్తిని ఉద్దేశించి గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పటికే తన దుకాణం మూతపడింది. అతనికి భార్యా, పిల్లలు ఉన్నారు. దీంతో ఆ వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ముందు నీ ఇంటి గురించి చూసుకో. ఇంటిని చక్కదిద్దలేని వ్యక్తి దేశాన్ని బాగు చేయలేడు. అందుకే ముందు నీ పిల్లలను బాగా చూసుకో. తర్వాత పార్టీ, దేశం గురించి ఆలోచించు అని సూచించాడు. ఈ మధ్య ఇలాంటి పరోక్ష వ్యాఖ్యలతో గడ్కరీ వార్తల్లో నిలుస్తున్నారు. కొన్ని రోజుల కిందట ఐఏఎస్, ఐపీఎల్ అధికారుల సమావేశంలో మాట్లాడుతూ.. నేను పార్టీ అధ్యక్షుడిని అయితే నా ఎమ్మెల్యేలు బాగా పనిచేయకపోతే, నా ఎంపీలు అసమర్థులైతే దానికి నాదీ బాధ్యత. వాళ్లను పని చేయించలేకపోవడం నా అసమర్థతే అవుతుంది అని గడ్కరీ అన్నారు. పైగా ఈ మధ్య రిపబ్లిక్ డే వేడుకల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పక్కనే కూర్చున్న గడ్కరీ.. ఆయనతో చాలా సమయం పాటు సీరియస్‌గా చర్చించడం కనిపించింది. ఈ నేపథ్యంలో రాహుల్ చేసిన ట్వీట్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.

3253
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles