రాజమ్మను కలిసిన రాహుల్ గాంధీ

Sun,June 9, 2019 11:23 AM

Congress President Rahul Gandhi met Rajamma

తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళ రాష్ట్ర పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. పర్యటన సందర్భంగా రాహుల్ నేడు రాజమ్మ అనే పదవీ విరమణ పొందిన నర్సును కలిశారు. ఎవరీ రాజమ్మ అనుకుంటున్నారా? గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ పౌరసత్వంపై వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఆయన భారతీయుడే అని, అందుకు తానే సాక్ష్యమని కేరళకు చెందిన రాజమ్మ వవథిల్ చెప్పారు. 19 జూన్ 1970లో ఢిల్లీలోని హాలి ఫ్యామిలీ దవాఖానలో రాహుల్ జన్మించారని తెలిపారు. ఆ సమయంలో దవాఖనలో తాను ట్రైయినీ నర్సుగా పనిచేస్తున్నానని వెల్లడించారు. పుట్టిన వెంటనే బాలుడిని ఎత్తుకున్న వారిలో తాను ఒకరిని అని పేర్కొంది. శిక్షణ పూర్తయిన తర్వాత రాజమ్మ సైన్యంలో నర్సుగా ఉద్యోగంలో చేరారు. అనంతరం స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని కేరళలో స్థిరపడ్డారు. వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తున్న రాహుల్ నేడు ఆమెను కలిసి పలకరించారు. ఆత్మీయ ఆలింగనం చేసుకొని యోగక్షేమాలు ఆరా తీశారు.

3583
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles