రాఫెల్‌పై మాట్లాడే దమ్ము ప్రధానికి లేదు!

Wed,January 2, 2019 07:34 PM

న్యూఢిల్లీ: పారిశ్రామిక వేత్త అనీల్ అంబానీకి ప్రయోజనం కల్పించేందుకే రాఫెల్ డీల్‌లో మార్పులు చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఢిల్లీలో రాహుల్ మాట్లాడుతూ ప్రధానిపై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్‌లో సమాధానం చెప్పడానికి ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు రారు. రక్షణ మంత్రి కూడా సమాధానం చెప్పరు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడాల్సిన దుస్థితి నెలకొంది. ఖాళీ విమానానికి.. ఫుల్లీ లోడెడ్ విమానానికి మధ్య కాంగ్రెస్‌కు తేడా తెలీదని జైట్లీ అంటున్నారు.


రాఫెల్ ఒప్పందంపై మోదీతో చర్చకు సిద్ధంగా ఉన్నాం. రాఫెల్‌పై మాట్లాడే దమ్ము ప్రధానికి లేదు. మోదీతో ముఖాముఖి మాట్లాడానికి నేను సిద్ధం. రాఫెల్ డీల్‌పై దర్యాప్తు చేయవద్దని సుప్రీం కోర్టు చెప్పలేదు. జేపీసీ వేయవద్దని కూడా సుప్రీం చెప్పలేదు. వాస్తవాలు దేశానికి తెలియాలి. రాఫెల్ ఒప్పందం దేశంలో కనీవినీ ఎరగనీ అవినీతి. దేశానికి మోదీ కాపలాదారు కాదు.. దొంగే. సైన్యం పేరు చెప్పి.. భావోద్వేగాలు ఎంతోకాలం రెచ్చగొట్టలేరని రాహుల్ పేర్కొన్నారు.

937
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles