కాంగ్రెస్‌ పార్టీకి ప్రియాంక గుడ్‌బై

Fri,April 19, 2019 11:38 AM

Congress party Spokes Person Priyanka Chaturvedi Quits Party

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీకి ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది గుడ్‌బై చెప్పారు. కొద్ది రోజుల క్రితం మధురలో ప్రియాంక చతుర్వేది రఫెల్‌ డీల్‌ గురించి మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో ఆమె పట్ల కొందరు కాంగ్రెస్‌ నేతలు అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో వారిపై ప్రియాంక కాంగ్రెస్‌ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో వారిని పార్టీ సస్పెండ్‌ చేసింది. అయితే జ్యోతిరాదిత్య సింధియా జోక్యంతో వారిపై సస్పెండ్‌ ఎత్తివేసినట్లు ప్రకటించారు. దీనిపై ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. అభ్యంతరకరంగా మాట్లాడి, తనను బెదిరించిన వాళ్లకు కనీస శిక్ష పడకపోవడం చాలా బాధిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో పార్టీ కోసం శ్రమించే వారికి బదులు గాలి బ్యాచ్‌కు ప్రోత్సహం ఇస్తుందని.. గూండాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమె ఆరోపిస్తూ ట్వీట్‌ చేశారు. మొత్తానికి ప్రియాంక చతుర్వేది పట్ల కాంగ్రెస్‌ పార్టీ నిర్లక్ష్యం వ్యవహరించడంతో ఆమె ఆ పార్టీని వీడారు.

2296
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles