హ‌మ్ నిభాయేంగే.. ఇదీ కాంగ్రెస్ మేనిఫెస్టో

Tue,April 2, 2019 12:56 PM

congress party releases manifesto for 2019 loksabha polls

హ‌మ్ నిభాయేంగే..
న్యాయ్ స్కీమ్‌తో పేద‌ల‌కు క‌నీస ఆదాయం
జ‌మ్మూక‌శ్మీర్ అభివృద్ధి కోసం కొత్త ఎజెండా
స‌ర‌ళ‌త‌ర‌మైన జీఎస్టీ విధానం అమ‌లు
జీఎస్టీ కేవ‌లం రెండు స్లాబుల్లోనే
ఇంటెలిజెన్స్ ఏజెన్సీల్లో రాజ‌కీయ ప్ర‌మేయం ఉండ‌దు


హైద‌రాబాద్: కాంగ్రెస్ పార్టీ ఇవాళ 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల మేనిఫెస్టో విడుద‌ల చేసింది. హ‌మ్ నిభాయేంగే(మేం నెర‌వేరుస్తాం) అన్న టైటిల్‌తో మేనిఫెస్టోను విడుద‌ల చేశారు. ఇవాళ చ‌రిత్రాత్మ‌క‌మైన రోజు అని, కాంగ్రెస్ మేనిఫెస్టో భార‌త్‌ను బ‌లంగా, అభివృద్ధిప‌థంలో తీసుకువెళ్తుంద‌ని ర‌ణ్‌దీప్ సుర్జేవాలా తెలిపారు. ప్ర‌జ‌ల్లోకి వెళ్లి, ప్ర‌జ‌ల‌కు ఏం కావాలో తెలుసుకురావాల‌ని రాహుల్ ఆదేశించార‌ని, ఆ ర‌కంగానే ప్ర‌జ‌ల ఐడియాలు ప్ర‌తిబింబించేలా మేనిఫెస్టోను రూపొందించామ‌ని ఎంపీ రాజీవ్ గౌడ తెలిపారు. ద‌ళితులు, యువ‌కులు, మైనార్టీలు, ఆరోగ్యం, విద్య లాంటి అంశాల‌కు పూర్తి ప్రాధాన్య‌త ఇస్తూ మేనిఫెస్టోను త‌యారు చేశామ‌ని మాజీ కేంద్ర మంత్రి చిదంబ‌రం తెలిపారు. మోదీ పాల‌నలో నిరుద్యోగం పెద్ద స‌మ‌స్య‌గా మారింద‌ని, గ‌త అయిదేళ్ల‌లో 4.70 కోట్ల ఉద్యోగాలు కోల్పోయిన‌ట్లు ఆయ‌న తెలిపారు. రైతులు కూడా చాలా దెబ్బ‌తిన్నార‌ని చిదంబ‌రం అన్నారు. ప్ర‌జ‌ల మ‌ర్యాద‌, ఆత్మ‌గౌర‌వాన్ని త‌మ మేనిఫెస్టో ప్ర‌తిబింబిస్తుంద‌ని మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ తెలిపారు. జ‌న్ ఆవాజ్ ఘోష‌ణ ప‌త్ర్ అన్న పేరుతో మేనిఫెస్టోను పిలువ‌నున్నారు. పేద‌రికాన్ని పార‌ద్రోలేందుకు తీసుకునే చ‌ర్య‌ల గురించి మేనిఫెస్టోలో చెప్పార‌న్నారు. ప‌దేళ్ల యూపీఏ పాల‌న‌లో సుమారు 14 కోట్ల మంది ప్ర‌జ‌లు పేద‌రికం నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ట్లు మ‌న్మోహ‌న్ చెప్పారు. ఏడాది క్రితం నుంచే మేనిఫెస్టో కోసం క‌స‌ర‌త్తులు మొదలుపెట్టిన‌ట్లు రాహుల్ తెలిపారు. చిదంబ‌రం, గౌడ‌ల‌కు మేనిఫెస్టో గురించి సూచ‌న‌లు చేసిన‌ట్లు చెప్పారు. కాంగ్రెస్‌లో అనుభ‌వ‌జ్ఞులైన నేత‌లు ఉన్నార‌ని తెలుసు, కానీ ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి మేనిఫెస్టోను త‌యారు చేయాల‌ని ఆదేశించాన‌న్నారు. ప్ర‌ధాని మోదీ ప్ర‌తి రోజూ ఓ అబద్దం చెబుతుంటార‌ని, అలాంటి అబ‌ద్దాలు మ‌న మేనిఫెస్టోలో ఉండ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించామ‌ని రాహుల్ అన్నారు.


1487
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles