మ. 2 గంటలకు రాహుల్ మీడియా సమావేశంMon,December 18, 2017 11:09 AM
మ. 2 గంటలకు రాహుల్ మీడియా సమావేశం

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. సోనియా గాంధీని సోమవారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ర్టాల శాసనసభ ఎన్నికల ఫలితాలపై చర్చించినట్లు తెలుస్తుంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడనున్నారు. మీడియా సమావేశంలో ఎన్నికల ఫలితాలతో ఇతర అంశాలపై రాహుల్ మాట్లాడే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్‌కు ఇదే తొలి మీడియా సమావేశం.

675
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS