కాంగ్రెస్‌దే మేఘాలయా !

Sat,March 3, 2018 10:53 AM

Congress party leads in Meghalaya polls

షిల్లాంగ్ : కాంగ్రెస్ పార్టీకి ఇదో ఊరట. మేఘాలయాలో ఆ పార్టీ దూసుకెళ్లుతున్నది. ఈశాన్య రాష్ర్టాల్లో కాంగ్రెస్ జాడ కనుమరుగవుతుందని అనుకున్నారు. కానీ మేఘాలయా రాష్ర్టాన్ని కాంగ్రెస్ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఆ పార్టీ ఆధిక్యంలో దూసుకువెళ్తున్నది. మేఘలయాలో 59 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటులకు 31 సీట్లు కావాలి. అయితే తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ 22 సీట్ల ఆధిక్యంలో ఉన్నది. ప్రత్యర్థి నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ) 15 సీట్ల ఆధిక్యంతో తర్వాత స్థానంలో ఉన్నది. మేఘాలయాలో బీజేపీ కేవలం ఆరు సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉన్నది. సీఎం అభ్య‌ర్థి ముఖుల్ సంగ్మా .. అంప‌టి నియోజ‌క‌వ‌ర్గం నుంచి లీడింగ్‌లో ఉన్నారు.

2542
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS