టీవీ చ‌ర్చ‌ల‌కు కాంగ్రెస్ నేత‌లు దూరం

Thu,May 30, 2019 11:50 AM

Congress not to send spokespersons to TV debates for a month

హైద‌రాబాద్: కాంగ్రెస్ పార్టీ క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్న‌ది. త‌మ పార్టీకి చెందిన ప్ర‌తినిధులు, మీడియా ప్యానలిస్టుల‌ను టీవీ చ‌ర్చ‌ల‌కు వెళ్ల‌వ‌ద్దు అంటూ ఆదేశించింది. ఒక నెల రోజుల పాటు టీవీ చ‌ర్చ‌ల‌కు దూరంగా ఉండాల‌ని ప్ర‌క‌టించింది. కాంగ్రెస్ పార్టీ క‌మ్యూనికేష‌న్ చీఫ్ ర‌ణ్‌దీప్ సుర్జేవాలా దీనికి సంబంధించి ఓ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేత‌ల‌ను షోల‌కు ఆహ్వానించ‌రాదు అని టీవీ ఎడిట‌ర్ల‌కు కాంగ్రెస్ విజ్ఞ‌ప్తి చేసింది. అయితే ఎందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌న్న దానిపై కాంగ్రెస్ పార్టీ సరైన వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. తాజాగా జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ కేవ‌లం 52 స్థానాల్లో మాత్ర‌మే గెలిచింది. దీంతో తీవ్ర అస‌హ‌నానికి గురైన ఆ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ త‌న ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు సిద్ద‌మైన విష‌యం తెలిసిందే.1207
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles