పరారీలో ఉన్న ఎమ్మెల్యే అరెస్ట్

Wed,February 20, 2019 06:54 PM

Congress MLA JN Ganesh arrested in assault case

బెంగళూరు: సహచర ఎమ్మెల్యేపై దాడి కేసులో పరారీలో ఉన్న కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జేఎన్ గణేశ్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 20న ఈగిల్‌టన్ రిసార్ట్‌లో జరిగిన ఓ సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్, ఎమ్మెల్యే జేఎన్ గణేశ్‌కు మధ్య వ్యక్తిగత విషయంలో గొడవ జరిగింది. ఎమ్మెల్యే జేఎన్ గణేశ్ ఆనంద్ సింగ్‌పై దాడి చేశారు. ఆనంద్‌సింగ్‌పై కన్ను, ఛాతిపై పిడిగుద్దులు వేశారు.

ఈ ఘటనలో గాయాలైన ఆనంద్‌సింగ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్సనందించారు. ఆనంద్‌సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే జేఎన్ గణేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. తాజాగా ఇవాళ అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

3711
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles