ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్‌ నేత రాజీనామా

Mon,March 4, 2019 11:17 AM

Congress MLA Dr Umesh Jadhav Submits Resignation to Karnataka Assembly Speaker

బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌.. ఆ పార్టీకి చెందిన ఓ నాయకుడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. చించోలి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉమేష్‌ జాదవ్‌.. తన ఎమ్మెల్యే పదవికి ఇవాళ రాజీనామా చేశారు. అనంతరం తన రాజీనామా లేఖను కర్ణాటక శాసనసభ స్పీకర్‌కు అందజేశారు. ఉమేష్‌ జాదవ్‌ త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 6న కర్ణాటక పర్యటనకు వస్తున్నారని.. ఆ సందర్భంగా ఉమేష్‌ బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. ఈ నెల 1వ తేదీన బీజేపీ నాయకుడు బాబురావు మాట్లాడుతూ.. మల్లికార్జున్‌ ఖర్గేకు జాదవ్‌ మద్దతివ్వరని తెలిపారు. అధికారం కోసం బీజేపీలోకి జాదవ్‌ రావడం లేదని షెడ్యూల్డ్‌ తెగల అభివృద్ధి కోసం వస్తున్నారని స్పష్టం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉమేష్‌ జాదవ్‌.. కాలాబురాగి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. చించోలి నియోజకవర్గం నుంచి జాదవ్‌ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వృత్తిరీత్యా డాక్టరైన జాదవ్‌.. రాజకీయ రంగ ప్రవేశం కంటే ముందు కాలాబురాగి ప్రభుత్వ ఆస్పత్రిలో సర్జన్‌గా పని చేశారు.

3816
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles