యూపీలో కాంగ్రెస్ నేత కాల్చివేత

Wed,October 16, 2019 04:45 PM


అలీగఢ్: యూపీలో కాంగ్రెస్ నేతను దారుణంగా కాల్చిచంపారు. ఇద్దరు వ్యక్తులు బైకుపై శంషాద్‌కు సమీపంలోని కాంగ్రెస్ నేత మహ్మద్ ఫరూఖ్‌ ఆఫీసుకు వచ్చారు. ఇద్దరు మంగళవారం రాత్రి ఆఫీస్‌లోకి చొరబడి ఫరూఖ్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఫరూఖ్‌కు తీవ్రగాయాలవగా..అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారని ఎస్పీ అభిషేక్ కుమార్ తెలిపారు. నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్థి వివాదం వల్లే ఫరూఖ్‌ను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

359
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles