కాంగ్రెస్ నేత గురుదాస్ కామత్ కన్నుమూత

Wed,August 22, 2018 09:48 AM

Congress Leader Gurudas Kamat Dies at 63 After Heart Attack

న్యూఢిల్లీ : సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి గురుదాస్ కామత్(63) ఇవాళ ఉదయం కన్నుమూశారు. కామత్‌కు గుండెపోటు రావడంతో ఢిల్లీలోని ప్రీమూస్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కామత్ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కామత్ మృతిపట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌తో పాటు పలువురు నాయకులు సంతాపం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయిందని అశోక్ గెహ్లాట్ అన్నారు. కామత్ మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు అశోక్ గెహ్లాట్. గురుదాస్ కామత్ ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు.972
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS